జెడి ఫౌండేషన్ గోపాలపట్నం, విశాఖపట్నం ఆధ్వర్యంలో “అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం” సందర్భంగా గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో జీవీఎంసీ ఉద్యానవన శాఖ నుండి తీసుకున్న వేప,బాదం,కదంభం,జువ్వి,తదితర మొక్కలు నాటడం జరిగింది ఈకార్యక్రమంలో గ్రౌండ్లో ఉన్న వాకర్స్, బాక్సింగ్ క్రీడాకారులు ,చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, ముఖ్యంగా ఒక మొక్కను ఇద్దరు చిన్నారులు దత్తతకు తీసుకుని వాటి సంరక్షణ చేపడతామని ముందుకు రావడం చాలామంచి పరిణామంగా వక్తలు కొనియాడారు ఈకార్యక్రమంలో పిన్నమనేని శ్రీనివాస్ గారు,పి.ఆదినారాయణ గారు,జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు ఈకార్యక్రమానికి ఆర్థికసాయం చేసిన పి.ఏ.రామారావు గార్కి ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటు. జెడి ఫౌండేషన్ గోపాలపట్నం.