“అభాగ్యుల పాలిట ఆపద్బంధువు “ఉపాధి భరోసా”.
జే.డీ.ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లో మొట్టమొదటి ఉపాధి భరోసా కార్యక్రమం ప్రారంభం.
కష్టేఫలి అనే సూత్రాన్ని నమ్ముకుని, ఉచిత పథకాలకు బానిసలు కాకుండా కష్టపడే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా జే.డీ.ఫౌండేషన్ ఉపాధి భరోసా ప్రాజెక్టులో భాగంగా సింహాచలం ప్రాంతంలో నిరుపేద మహిళ కనకమహాలక్ష్మి కుటుంబానికి టిఫిన్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా శ్రీహరి చారిటబుల్ ట్రస్ట్,ఫౌండర్ శ్రీమతి వాస్తవాయి శారద వారి భర్త గారి శ్రీహరినాధ రాజు గారి జ్ఞాపకార్థం ఈ వ్యాపారానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. జెడి ఫౌండేషన్ సింహాచలం కోఆర్డినేటర్ శ్రీ ఎస్. నాగేంద్ర పర్యవేక్షణలో ఈ ఉపాధి భరోసా కార్యక్రమాన్ని శ్రీమతి వస్తావాయి శారద గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి శారద మాట్లాడుతూ తన భర్త ఎప్పుడూ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని చెప్తూ ఉండేవారని వారి జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం వారి ఆత్మకుశాంతి, సంతోషం కలుగజేస్తుంది అని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సింహాచలం సభ్యులతో పాటు శ్రీమతి సత్య శ్రీ ,శ్రీరంగరాజు పాల్గొన్నారు.