ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా మాజీ CBI JD వీ వీ లక్ష్మీనారాయణ గారు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన జాతీయ ఇంజినీర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1986లో బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి జీవితంలో తొలి వేతనాన్ని అప్పటి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటి అధ్యక్షుడు ముప్పలనేని శేషగిరిరావు చేతుల మీదుగా తీసుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ఏడాదికొక నూతన ఆవిష్కరణ చేయాలన్నారు.
.



