“శ్రీ వేల్లూరిపల్లి వేంకటరామ శేశాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి” నందు శ్రీ జేడి లక్ష్మీనారాయణ IPS గారు సందర్శించారు. ముందుగా కాలేజిలోని “ఇన్నోవేషన్ కేంద్రాన్ని” తన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ అనేది కొత్త ఆలోచనలకు సురక్షితమైన స్వర్గధామాన్ని సృష్టించే క్రాస్-ఫంక్షనల్ ప్లాన్. ఇంత చక్కటి సదుపాయం కల్పించినందుకు యాజమాన్యాన్ని మెచ్చుకుంటూ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా రైతులకు ఉపయోగపడే పరికరాలను తయారు చేసి, యువత వ్యవసాయానికి సరికొత్త బాటని చూపించాలని వారు కోరారు. అలాగే నేటి యువత దేశ భవిష్యత్తు కోసం తపన పడుతూ అడుగు వేయలాని, యువత రాజకీయాల వైపు కూడా శ్రద్ధగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
“ఇన్నోవేషన్ కేంద్రాన్ని” ప్రారంభించిన లక్ష్మీనారాయణ గారు

Categories: