14-12-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో “ఏక్ దిన్ – ఏక్ సాత్ – ఏక్ బ్యాగ్” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విశాఖ నగరంలోని మొత్తం 32 ప్రాంతాలలో చేపట్టారు. గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, నరవ, శ్రీహరిపురం, గాజువాక, కంచరపాలెం, మర్రిపాలెం, మురళీ నగర్, యల్లపువానిపాలెం, కొత్తపాలెం, చంద్రానగర్, లక్ష్మీ నగర్, నాయుడుతోట, ఆంధ్రా యూనివర్శిటీ ఏ ఐ హబ్, మల్కాపురం తదితర ప్రాంతాలలో ఫౌండేషన్ సభ్యులు విస్తృతంగా వస్త్ర సంచులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి తీవ్ర హానికరమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, వస్త్ర సంచుల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలను కోరారు.
సమాజంలో పర్యావరణ చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమం విశాఖ నగరంలో మంచి స్పందనను పొందింది. ప్రజలు కూడా స్వచ్ఛమైన, హరితమైన భవిష్యత్తు కోసం ముందడుగు వేయాలని ఫౌండేషన్ సభ్యులు పిలుపునిచ్చారు.



20-12-2025: “ఏక్ దిన్ – ఏక్ సాత్ – ఏక్ బ్యాగ్” కార్యక్రమం కొనసాగింపుగా ఈ రోజు విశాఖపట్నం ఇండస్ట్రియల్ హౌసింగ్ కాలనీ ఆర్ కే పురం వద్ద వస్త్ర సంచులు పంపిణీ చేయడం జరిగింది.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్త్ర సంచులు అందజేశారు.

28-12-2025: “ఏక్ దిన్ – ఏక్ సాత్ – ఏక్ బ్యాగ్” ఈ కార్యక్రమం భాగంగా పద్మనాభపురం హనుమాన్ కుటీర్ ప్రాంగణంలో వస్త్ర సంచులు పంపిణీ చేయడం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ సందేశంతో ప్రజలను చైతన్యపరిచారు.


