ఏజ్ కేర్ ఫౌండేషన్ గంభీరం ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్

14-11-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంభీరం ప్రాంతంలో గల Age Care Foundation (ఏజ్ కేర్ ఫౌండేషన్) ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం మరియు గౌ ఆధారిత వ్యవసాయం గురించి ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రంలో వంగ, టమాటో, మిరప వంటి కూరగాయల మొక్కలను విద్యార్థుల చేత నాటించారు. ప్రకృతి అనుకూల పద్ధతుల్లో సాగు చేసే విధానాలు, పర్యావరణానికి మేలు చేసే సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వంగ, టమాటో, మిరప, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి కూరగాయ మొక్కలతో పాటు వివిధ రకాల ఆకుకూర విత్తనాలను నాటడం జరిగింది. సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలను పండించి, ఫౌండేషన్ నిర్వహణలో నడుస్తున్న ఆసుపత్రికి వచ్చే వారికి ఆరోగ్యకరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయబడిందని నిర్వాహకులు తెలిపారు.

స్వచ్ఛమైన, రసాయన రహిత ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ ద్వారా స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏజ్ కేర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాసరావు గారు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు.

సమాజ శ్రేయస్సు మరియు ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో మంచి స్పందన పొందింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader