11-06-2025 న ఏరువాక పౌర్ణమి సందర్భంగా, జే.డీ. ఫౌండేషన్ 7వ సంవత్సరం వేడుకలలో భాగంగా, జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖ (పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా) ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహితమైంది.
ఈ కార్యక్రమాన్ని పొప్పొప్పు వెంకట నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నిర్వహించారు. గ్రామ పెద్దలు చిట్టిడి మూర్తి గారు, రేలంగి రాజేష్ గారు, అలాగే బోలిశెట్టి సూర్యప్రకాశ్, పంతం కృపాకర్రావు, పొప్పొప్పు శివలు పాల్గొని రైతులను సన్మానించారు.
సన్మానించబడిన గ్రామాలు :
- ముక్కామల
- ముత్యాలవారి పాలెం
- ఉమ్మిడివారిపాలెం
- ఓదురివారిపాలెం

కార్యక్రమంలో పాల్గొన్న రైతులు :
- చిట్టిడి సూర్యనారాయణ
- నరుకుల తమ్మారావు
- రేలంగి చిన్న వెంకన్న
- తోరటి శ్రీనివాస్
- ఉమ్మిడి లక్ష్మణరావు
- ఉమ్మిడి సూర్య భాస్కర్ రావు
- ముత్యాల నరసింహారావు
- అడపా శ్రీనివాసరావు
- తదితరులు

జే.డీ. ఫౌండేషన్ గ్రామ రైతుల సేవకు, గ్రామాభివృద్ధికి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.




