Activities,Service “ఇరుసుమండ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు సన్మానం”

“ఇరుసుమండ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు సన్మానం”

Categories:

ఏరువాక పౌర్ణమి,రైతులకు సన్మానం

కోనసీమ ఆహారనిధి మరియు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో వ్యవస్థాపక అధ్యక్షులు వీరంశెట్టి సతీష్ అధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రైతులందరూ కలిసి సహపంక్తి అల్ఫాహార విందు స్వీకరించారు.. అనంతరం వేద మంత్రాలతో ట్రాక్టర్ కి ,వ్యవసాయ పనిముట్లకి పూజ చేసి 15 మంది రైతులకు నూతన పంచె,కండువా,మామిడి పండ్లు బహుకరించారు,దండలతో సన్మానం చేశారు.దేశానికి వెన్నుముక రైతు..రైతులు సుభిక్షంగా ఉండి పంటలు పండాలి..దాన్యగారాలు నిండాలి..
రైతు పది వేళ్ళు మట్టిలో వెళితే,మన అయిదు వేళ్ళు నోట్లోకి వెళ్తాయి అని సతీష్ తెలిపారు..
ఈ కార్యక్రమంలో రైతులు రామకృష్ణ పరమహంస, రంకిరెడ్డి కాశీ, విజయరావు, ఏడుకొండలు,శర్మ సభ్యులు వీరంశెట్టి పవన్ గంగరాజు,శివరామకృష్ణ వీరు గట్టెం,బండారు సురేష్,చీకట్ల కిరణ్,మహేష్,అయ్యప్ప పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *