14-07-2025 న కంఫర్ట్ హోమ్స్, పురుషోత్తంపురం ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సింగల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ నేపథ్యంలో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు HPCL విశాఖపట్నం సహకారంతో పర్యావరణ హితమైన గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను సక్రమంగా వేరు చేయడం, అపార్ట్మెంట్ వాసుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా చేపట్టబడింది.
జీవీఎంసీ అధికారులు ఇచ్చిన సూచనలు :
సమావేశానికి విచ్చేసిన జీవీఎంసీ అధికారులు ప్రశాంత వాతావరణంలో ప్రజలకు పలు ముఖ్యమైన అంశాలను వివరించారు:
- సింగల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు
- తడి చెత్త – పొడి చెత్తలను వేర్వేరు చేయాల్సిన అవసరం
- సరైన చెత్త నిర్వహణ ద్వారా దోమల పెరుగుదలను నివారించడం
- పర్యావరణ హితమైన అలవాట్లు పెంపొందించడం

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు :
- జీవీఎంసీ అదనపు కమిషనర్ శ్రీ రమణ మూర్తి గారు
- HPCL PRO శ్రీ కాళి గారు
- జేడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు
- జీవీఎంసీ మెడికల్ ఆఫీసర్
- కంఫర్ట్ హోమ్స్ కార్యవర్గం
- శ్రీ కాళి కేశ్వరరావు గారు
- శ్రీ శేషుకుమార్ గారు
- జేడి ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు
- అపార్ట్మెంట్ వాసులు

ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే కాకుండా, ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని ప్రోత్సహించడంలో ఒక కీలక అడుగైంది.




