“గంగవరం పోర్టు ఎంప్లాయిస్ యూనియన్” వారు మాజీ సీబీఐ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ IPS వారిని అతని నివాసంలో కలిసి గంగవరం పోర్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను జేడీ గారి దృష్టికి తీసుకువచ్చారు, వారు తమ జీతబత్యాలు, వైద్య సౌకర్యాలు మొదలగు అంశాలపై వి.వి.లక్ష్మీనారాయణ IPS వారికి వినతిపత్రం అందజేశారు, ఆయా సమస్యలను సవివరంగా తెలుసుకున్న వి.వి.లక్ష్మీనారాయణ IPS గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి డిమాండ్ల సాధనకు కృషిచేస్తానని తెలియజేశారు.