జేడీ ఫౌండేషన్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింహాచలంశ్రీ వరాహ పుష్కరిణిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జెడి ఫౌండేషన్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(USA) ఆధ్వర్యంలో సింహాచలం శ్రీ వరాహ పుష్కరిణి ప్రాంగణంలో “మన గుడి మన భాద్యత” అనే కార్యక్రమం నేపథ్యంలో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .కొనేరులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను,చనిపోయిన చేపలను,చెత్తను కొంతమేరకు తీయడం జరిగింది కొనేరులో చేపలు చనిపోడం వలన విపరీతమైన దుర్గంధం వేదజల్లుతున్నా గ్రూప్ సభ్యులు ముఖ్యంగా మహిళామణులు పాల్గొనడం అభినందనీయం ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కోనేరుకు పూర్వ వైభవం తీసుకుని రావాలని వక్తలు కోరుతున్నారు ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు పాసర్ల ప్రసాద్ గారు,సేవ్ టెంపుల్స్ ప్రతినిధి పిన్నమనేని శ్రీనివాస్ గారు జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జెడి ఫౌండేషన్ గోపాలపట్నం, విశాఖపట్నం.
.