ఘనంగా ఐఐటి చుక్కారామయ్యగారి ఇష్ట విద్యా సంస్థల దశాబ్ది వార్షికోత్సవాలు
ఇష్ట విద్యా సంస్థల వారి దశాబ్ది వార్షికోత్సవాలను పటేల్ గూడ క్యాంపస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గారు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా భీరంగుడ లోని ఇష్టా కొత్త బ్రాంచ్ ని సిబిఐ మాజీ డైరెక్టర్ J.D లక్ష్మీనారాయణ గారి చేతులు మీదగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఐఐటి చుక్క రామయ్య గారి ఇష్ట విద్యాసంస్థల యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఇష్టా విద్యాసంస్థల దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో బాగున్నాయి. అదేవిధంగా ఇష్టా విద్యాసంస్థలు దాదాపు పది ఎకరాలతో విద్యార్థులకు అనువైన క్రీడా ప్రాంగణం కలిగి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తమయొక్క లక్ష్య సాధన కొరకు ఈ ఇష్టా విద్యాసంస్థలు ఎంతగానో ఉపయోగపడుతుందని కొనియాడారు. అదేవిధంగా ఇష్ట విద్యాసంస్థలు10 సంవత్సరాల క్రితం 30 మందితో ప్రారంభించబడి నేడు వేలాదిమంది జీవితాలు మార్చిందని, రాబోయే రోజుల్లో కూడా మరెన్నో ఫలితాలను సాధించి ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తును మార్చే విధంగా తోడ్పడుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటలు చాలా అవసరం అని చెప్పారు. ఇంటర్ తో పాటు ఐఐటి నీట్ మరియు డిఫెన్స్ మరియు సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కోర్సులు చాలా అవసరమని అన్నారు..