Activities,Service “చదువుల తల్లికి జేడీ లక్ష్మినారాయణ గారి అభినందన”

“చదువుల తల్లికి జేడీ లక్ష్మినారాయణ గారి అభినందన”

Categories:

     అమలాపురం మండలం, నడిపూడి గ్రామానికి చెందిన మద్దాల దేవి శిరీష జాతీయ స్థాయిలో నిర్వహించే NEET పరీక్షలో ఆంధ్రప్రదేశ్ నుండి 721 వ ర్యాంక్ సాధించింది.   కర్ణాటకలో కొబ్బరి వలుపు కార్మికునిగా పనిచేస్తూ తన కూతురి చదివిస్తున్న శ్రీ మద్దాల సత్యనారాయణ గురించి తెలుసుకున్న CBI మాజీ జేడీ శ్రీ V.V. లక్ష్మీ నారయణ IPSగారు, వారి బృందాన్ని స్వయంగా ఇంటికి పంపించి, ఆమెతో పోన్లో స్వయంగా మాట్లాడి అభినందించి, ఉన్నత విద్య విషయంలో అండగా నిలబడతానని భరోసానిచ్చారు.
ఆమెను జేడీ ఫౌండేషన్ ప్రతినిధి వీరంశెట్టి సతీష్ మరియు గ్రామ పెద్ద నల్లా వెంకటేశ్వర రావు చేతుల మీదుగా సత్కరించడం జరిగింది.
జేడి గారి సూచన మేరకు అబ్దుల్ కలాం గారి “MY INDIA” పుస్తకాన్ని అందించారు.
ఒక సామాన్య మధ్యతరగతి కి చెందిన తనని గుర్తించి అండగా నిలుస్తామని జేడీ గారి లాంటి మహోన్నతములు చెప్పడం తో సాధారణ పని చేసుకుని జీవనం సాగించే ఆమె తల్లదండ్రులు సంతోషం వెలిబుచ్చారు.

ఈ కార్యక్రమం లో జేడీ ఫౌండేషన్  మరియు కోనసీమ ఆహారనిధి సభ్యులు వీరంశెట్టి సతీశ్, నల్లా వెంకటేశ్వర రావు, గట్టెం వీరు, బండారు సురేష్, చీకట్ల కిరణ్, అయ్యప్ప స్వామి, ఆకుల RK నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *