చింతలపూడి మండలంలో ఏరువాక పున్నమి వేడుక..
చింతలపూడి మండలంలో
జెడి ఫౌండేషన్ ,అబ్దులకాలం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చింతలపూడి మండలం లో ఎండపల్లి&రేచర్ల గ్రామలలో ఏరువాక పున్నమి వేడుక ను నిర్వహించారు. ఈ సందర్భంగా కాడెద్దులకు నాగలికి పసుపు కుంకుమ లతో పూజలు నిర్వహించారు. అబ్దులకాలం యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షులు మరికంటి గోపాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ
వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారని. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం.రైతులందరూ కూడా తినడానికి దేశీ వరి విత్తనాలు తో ఎరువులు పురుగు మందులు లేని ఆహారం పండించాలి అని ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలి అని అధ్యక్షులు యువ రైతు గోపాలకృష్ణ పేర్కొన్నారు.
నాగరికత ఎంత ముందుకు సాగినా నాగలి కదలనిదే ఆ నాగరికత కు పరమార్థం ఉండదని రేచర్ల గ్రామ సర్పంచ్ శివ రామకృష్ణ పేర్కొన్నారు.
రైతు లేనిదే రాజ్యం లేదని , రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లక్ష్మి నారాయణ కృషి చేస్తున్న క్రమంలో గత 4 సంవత్సరాలుగా తాము ఏరువాక పండుగను సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా 15 మంది ఉత్తమ రైతు సోదరులకు నూతన వస్త్రాలు పెట్టీ సత్కరించారు. మిఠాయిలు అందచేశారు. కార్యక్రమం లో జెడి ఫౌండేషన్ ప్రతినిధులు,NSS విద్యార్థులు శ్రీహరి జల్లెళ్ళ కుమారస్వామి ,రవి రైతులు పాల్గొన్నారు.
.