Activities,Service “జవాన్లకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘననివాళి”.

“జవాన్లకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘననివాళి”.

Categories:

“అమరవీరుల” త్యాగాలు వెలకట్టలేనివి.. ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ ఎస్.తిరుపతి.
పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘననివాళి.  
 
                           
 
              2019 వ సంవత్సరంలో ఫిబ్రవరి 14న అతి దారుణంగా ఉగ్రదాడి కి బలైన అమర జవాన్ల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని, వారి త్యాగాలు భారత దేశం ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటుంది అని తెలిపారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ ఎస్ తిరుపతి, ఈ మేరకు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఉగ్రదాడిలో బలైన అమర జవాన్లకు సంఘీభావంగా కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేడీ పౌండేషన్ భాద్యుడు శ్రీ మురళి మోహన్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్ల సేవలు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీ కడలి నాగరాజు , శ్రీమతి అపర్ణ ,ఏ ఎస్సై శ్రీ సి.హెచ్.వేంకటేశ్వర రావు, విద్యార్థినులు ప్రవళిక, మౌనిక,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *