13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డులో గతంలో నాటిన మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రక్షణగా కంచె ఏర్పాటు చేయడం జరిగింది.
అదే విధంగా, గతంలో విరిగిపోయిన మరియు దెబ్బతిన్న కొన్ని మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలను నాటి పచ్చదనాన్ని మరింత పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల్లో పర్యావరణ అవగాహన పెంచడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో జేడీ ఫౌండేషన్ నిరంతరం సేవలు కొనసాగిస్తోంది.


స్థానిక ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది.
