అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కావలిలోని “జేడీ ఫౌండేషన్” ఆధ్వర్యంలో మహిళా నాయకురాలు మాకినేని అరుణ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అందరు కలసి కేకును కట్ చేసి తమ సంతోషాన్ని తెలియపరిచారు.ఈ సందర్భంగా మాకినేని అరుణ మాట్లాడుతూ, ఈరోజు ఈ వేడుకలు ఘనంగా చేసుకోవడం, అందులో మా మహిళలు అందరూ పాల్గొనడం ఎంతో ఆనంద దయాకంగా ఉందని అరుణ అన్నారు. ఈరోజు మహిళలకు స్వాతంత్రం వచ్చిన రోజు అని ప్రతి ఒక్కరు కూడా మహిళలను తప్పకుండా గౌరవించాలని, ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీ కచ్చితంగా ఉంటుందని ఆమె అన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు కాలనిలోని రెడ్ ఫీల్డ్స్ స్కూల్ లో విద్యార్థులకు కేకులు పంచి పలు ఆటలు పోటీలు నిర్వహించారు. అనంతరం నెల్లూరులో జరిగిన కార్యక్రమం నందు జెడి ఫౌండేషన్ కన్వీనర్ మాకినేని అరుణ కు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు, స్కూల్ సిబ్బంది పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కళ్లు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం.. బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందరినీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి పాదాభివందనం.


