జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “పొలం బాట” అనే కార్యక్రమం కాకినాడ జిల్లా ,ప్రత్తిపాడు మండలం,ధర్మవరం గ్రామంలో సీబీఐ మాజీ జెడి శ్రీ లక్ష్మీనారాయణ IPS గారు నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో మైసూర్ మల్లిక, తైవాన్ బ్లాక్ , కాలాబట్టి , తదితర వంగడాల వరి నాట్లు వేయడం జరిగింది ఈకార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయo పై ఆసక్తి ఉన్న S R ఎడ్యుకేషనల్ అకాడమీ విశాఖపట్నం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జెడి సార్ తో పాటు విద్యార్థులు,జెడి గ్రూప్ సభ్యులు వరి నాట్లు వేయడంలో పాల్గొన్నారు ఈకార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్ధ్ని విద్యార్థులను ఉద్దేశించి వి వి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంపై విద్యార్థి స్థాయి నుండి అవగాహ పెంచుకోవాలని కోరారు, ఎస్ ఆర్ క్యాంపస్ ఇంచార్జి శివ కిరణ్ గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు మా విద్యా సంస్థలు ముందువుంటాయని తెలియజేసారు ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ రంజిత్ కుమార్ గారు, సరస్వతి గారు , జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు . అనంతరం విద్యార్థులకు ప్రశoసంసా పత్రాలు పంపిణీ చేయడం జరిగింది జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం విశాఖపట్నం.🌳🌳..