జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా కు నాలుగు వసంతాలు..
నేటికీ ఉపాధి భరోసా పథకం ప్రారంభించి 4 సంవత్సరాలు, ఒక చిన్న ఆలోచన, కరోన నేపథ్యంతో చిద్రమైన కుటుంబాలకు చేయూతనివ్వాలననే గొప్ప సంకల్పంతో జేడీ ఫౌండేషన్, భద్రాచలం ఆధ్వర్యంలో “ఉపాధి భరోసా” పథకాన్నిప్రారంభించాము. అప్పటి నుండి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ,లయన్స్, వాసవి, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలు మరియు
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఫోటోలో తెలుపబడిన జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా లోని మొట్టమొదటి చిరు వ్యాపారం, భద్రాచలం పక్కన మోతే గ్రామంలో భర్త అనారోగ్యం మరియు ఉన్న ఇద్దరు పిల్లలు అంగవైకల్యంతో ఇబ్బంది పడుతూ,ఆర్థిక ఇబ్బందుల వల్ల అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే తరుణంలో జేడీ ఫౌండేషన్ వారికి భరోసా కల్పించి వారిచే ఒక చిన్న కిరాణా వ్యాపారం ప్రారంభించడం జరిగింది.నేడు ఈ కుటుంబం అందరికీ ఆదర్శం గా ఆ గ్రామంలోనే ఒక మంచి స్థితికి రాగలిగారు స్వయంగా జేడీ ఫౌండేషన్ చైర్మన్, మన అందరి పెద్దాయన శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు గతేడాది స్వయంగా ఈ గ్రామాన్ని మరియు ఈ షాప్ ని సందర్శించడం జరిగింది.తమ జీవితంలో వెలుగులు నింపిన మానవతా మూర్తి కి ఆ గ్రామస్తులు, ఆ కుటుంబం మంగళహారతులతో స్వాగతం పలికి వారి సంతోషాన్ని,కృతజ్ఞతలని తెలిపారు . ఇప్పటివరకు అన్ని ప్రాంతాల్లో సుమారు 30 పైచిలుకు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.ఇటువంటి మహత్తరమైన ఉపాధి భరోసా ప్రాజెక్టుని భద్రాచలం కాకుండా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా జెడి ఫౌండేషన్ సభ్యులు చేయడం హర్షనీయం, ఇటువంటి ఉపాధి భరోసా పథకానికి ఆర్థికంగా,హార్థికం గా సహకరిస్తున్న మహానుభావులు(దాతలు) అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.