ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 6511 పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు CBI విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ గారు తన జేడీ ఫౌండేషన్ ద్వారా ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణా సంస్థ HYD’S IACE ఇన్స్టిట్యూట్ వారి సహకారం తో 1000 మంది SI/కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ పద్దతిలో శిక్షణ అందించనున్నారు .ఈ శిక్షణా కార్యక్రమం లో అవకాశం కొరకు ఈ నెల డిసెంబర్ 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన 1000 మంది విద్యార్థులకు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ పద్దతిలో మెరుగైన శిక్షణ అందించడం ద్వారా అభ్యర్థులను పూర్తి స్థాయిలో తుది పరీక్ష కు సన్నద్ధం అయ్యేలా తయారు చేస్తామని జేడీ లక్ష్మీ నారాయణ గారు ఒక ప్రకటన లో తెలిపారు.
ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు 7093651037 నెంబర్ కు వాట్సాప్ లో ” HI “అని మెసేజ్ చేయగలరు… మరిన్ని వివరాలకు 9533200400 నెంబర్ ను సంప్రదించగలరు.