జే.డీ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు, శుభవార్త.
జేడీ ఫౌండేషన్ మరొక శాఖ(జేడీ ఫౌండేషన్- రాజమండ్రి) ప్రారంభం అయ్యిందని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
శ్రీమతి అల్లాడ కవిత గారు( శ్రీ T P రావు గారి పర్యవేక్షణలో) ప్రాతినిధ్యం వహిస్తున్నారు, శ్రీమతి కవిత గారు లయన్స్ క్లబ్ రాజమండ్రి కి గతంలో అధ్యక్షత వహించారు మరియు పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. గత సంవత్సరం జేడీ ఫౌండేషన్ ద్వారా వినాయక చవితి కి విగ్రహాలు కూడా పంపిణీ చేసారు.
జేడీ ఫౌండేషన్ రాజమండ్రి ద్వారా మొదటి కార్యక్రమం ని “ఉపాధి భరోసా” ద్వారా మొదలుపెట్టారు.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం బోరంపాడు గ్రామానికి చెందిన శ్రీమతి మంగ తాయారు(భర్త చనిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వడం తో, జేడీ ఫౌండేషన్ ని సంప్రదించగా, ఆమెకి జీవనోపాధి నిమిత్తం గ్రైండర్ ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ రాజమండ్రి భాద్యురాలు శ్రీమతి కవిత తో పాటు, పవన్ కుమార్, నాగచక్రం తదితరులు పాల్గొన్నారు.
శ్రీమతి కవిత గారికి వారి టీమ్ కి జేడీ ఫౌండేషన్ తరపున శుభాకాంక్షలు మరియు అభినందనలు💐🙏