జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం గ్రూప్ సభ్యుల సమావేశం

13-12-2025: జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం గ్రూప్ సభ్యుల సమావేశం స్థానిక గోపాలపట్నం పిన్నమనేని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఆదివారం కోరమాండల్ ఇంటర్నేషనల్ సహకారంతో వివిధ ప్రాంతాలలో నిర్వహించబోయే “ఏక్ దిన్ – ఏక్ సాత్ – ఏక్ బ్యాగ్” కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.

అనంతరం ఆదివారం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న వస్త్ర సంచులను సమావేశంలో పాల్గొన్న గ్రూప్ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవ్ టెంపుల్స్ ప్రతినిధి శ్రీ పిన్నమనేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా సభ్యులకు వస్త్ర సంచులు అందజేయడం జరిగింది.

రేపు ఆదివారం (14-12-2025) విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో జేడీ ఫౌండేషన్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ సందేశంతో వస్త్ర సంచులు పంపిణీ చేయనున్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమం సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader