“జేడీ ఫౌండేషన్ లక్ష్మీనారాయణ” సార్ ఆధ్వర్యంలో మరియు, పసుపులేటి సుధాకర్ గారి ఆర్ధిక సహాయంతో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ కవిత రెడ్డి , మరియు డా . నరేష్ గారు చీదెడు గ్రామ పాఠశాలను పుననిర్మించడం జరిగింది. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న పాఠశాల ఈ రోజు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా వసతులు చేయించడం జరిగింది. పాఠశాలను పునఃప్రారంభించడానికి జేడీ లక్ష్మీనారాయణ సార్ వచ్చి పాఠశాలను సందర్శించి చాల ఆనందాన్ని వ్యక్తం చేసారు.తల్లిదండ్రులకు , విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మంచి అవగాహన కల్పించారు,అలాగే విద్యార్థులచేత మొక్కలు నాటించడం జరిగింది , 80 మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు, లక్ష్మీనారాయణ సార్ గార్కి హృదయపూర్వక ధన్యవాదాలు, ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు కలిసి చేసే అవకాశం ఇస్తారని ఆశిస్తూ , జేడీ ఫౌండేషన్ కన్వీనర్ కవిత రెడ్డి.
– కొంపల్లి టీం హైదరాబాద్.