Activities “జేడీ ఫౌండేషన్ సేవలు భేష్”

“జేడీ ఫౌండేషన్ సేవలు భేష్”

Categories:

విద్యార్థులు న్యాయ సేవల పట్ల అవగాహన పెంచుకోవాలి, “జేడీ ఫౌండేషన్ సేవలు భేష్”. భద్రాచలం జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సి.సురేష్.
                     
 
 
 
 
 

                          విద్యార్థులు చిన్నతనం నుంచే ప్రభుత్వాలు అందిస్తున్న న్యాయ సేవలు, చట్టాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సి.సురేష్ చెప్పారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, భద్రాచలం శాంతి నగర్ కాలనీ లో ఉన్న MJPTBCWR (బాయ్స్) స్కూల్ నందు జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకుని ఆజాది కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా న్యాయ సేవల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేజిస్ట్రేట్ శ్రీ సి.సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగి ఉండి శాంతియుత ప్రపంచాన్ని నిర్మించేందుకు సన్నద్ధులవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు అనుమానాలను నివృత్తి చేశారు. అలాగే జేడీ ఫౌండేషన్ చేస్తున్న పర్యావరణ పరిరక్షణ,సామాజిక సేవలను ప్రశంసించారు,అడిగిన వెంటనే కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకారాన్ని తెలిపిన మేజిస్ట్రేట్ శ్రీ సి.సురేష్ కి జేడీ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ మురళీ మోహన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రంగాచార్యులు, జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీమతి హరిణి, శ్రీ అంబికా సురేష్, శ్రీ కడాలి నాగరాజు, శ్రీ జీతురాం,ఉపాధ్యాయులు,ఎన్. రామకృష్ణ, కె.సురేష్,ఎన్.స్వరూప,స్రవంతి, భాస్కర్, ఐటీసీ ప్రోగ్రాం మేనేజర్ శ్రీ సందీప్, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *