నందవానిపాలెంలో నిర్వహించిన ఏరువాక పున్నమి

11-06-2025 న జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతగట్ట్ల పంచాయితీకి చెందిన నందవానిపాలెం గ్రామంలో “ఏరువాక పున్నమి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ సంప్రదాయాలను కాపాడుతూ, రైతుల కృషిని గౌరవించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలో “రైతే రాజు – గ్రామస్వరాజ్యమే ధ్యేయం” అనే నినాదంతో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కు దున్ని, తరువాత మహిళా రైతులతో పాటు పలువురు రైతులను అభినందించారు.

కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు :

  • సర్పంచ్ కనకరాజు గారు
  • ఎంపీటీసీ నూకరాజు గారు

ఎంపీటీసీ నూకరాజు గారు పేర్కొన్నారు :

  • రైతులకు ప్రధాన సమస్య గిట్టుబాటు ధర లేకపోవడం
  • ఉపాదిహామీ పనుల దుర్వినియోగం
  • ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి జేడి లక్ష్మినారాయణ గారు మరింత చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు

జేడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను గారు సందేశం :

  • జేడి గారికి వ్యవసాయం అంటే మక్కువ
  • ఆహారాన్ని పండించే రైతులను గుర్తించి సన్మానించడం మన బాధ్యత అని తెలిపారు

కార్యక్రమ నిర్వహణ :
ఈ కార్యక్రమాన్ని యువరైతు బొడ్డేటి అప్పారావు గారు సమర్థవంతంగా నిర్వహించారు.

పాల్గొన్న వారు :

  • గణేష్ గారు
  • జేడి గ్రూప్ సభ్యులు
  • స్థానిక గ్రామస్తులు
  • పెద్ద సంఖ్యలో రైతులు

నందవానిపాలెం గ్రామంలో నిర్వహించిన ఈ ఏరువాక పున్నమి వేడుక గ్రామ వ్యవసాయ సంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు, రైతుల పట్ల గౌరవ భావనను మరింత బలపరిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader