కరోనా వేళ నిరుపేదలకు “జేడీ ఫౌండేషన్” అండ.
ప్రతిరోజు కరోనా బాధితులకు ఇండ్ల వద్దకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల మరియు కరోన వచ్చి ఇళ్ల వద్ద ఐసోలేషన్ లో ఉంటూ తినడానికి నిత్యవసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అండగా జేడీ పౌండేషన్ భద్రాచలం వారు భద్రాచలం పట్టణంలో గత కొద్ది రోజులుగా కరోన వచ్చి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు వారి ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు జేడీ ఫౌండేషన్ బాధ్యులు శ్రీ మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ మీడియా మిత్రులు ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా సమాచారం సేకరించి ఎవరైతే నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారి ఇళ్ల వద్దకు నిత్యావసర సరుకుల ను అందజేస్తున్నారు. ఈ మేరకు గురువారం అశోక్ నగర్ కాలనీ లో ఉన్న మాదిరెడ్డి సత్యనారాయణ కుటుంబం కి, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా లో ఉంటున్న పుచెర్ల ముత్తమ్మ 80 సంవత్సరాల ముసలావిడ కుటుంబం కి నిత్యావసర వస్తువులు ఫౌండేషన్ సభ్యుడు శ్రీ కడాలి నాగరాజు అందజేశారు. ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందిస్తున్న జేడీ పౌండేషన్ కి,వారు కృతజ్ఞతలు తెలిపారు.


