Activities,Service “నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న జేడీ ఫౌండేషన్”

“నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న జేడీ ఫౌండేషన్”

Categories:

చితికిన బతుకులకు చేయూత..ఉపాధి భరోసా.
నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న జేడీ ఫౌండేషన్.

పేద వాడి కళ్ళల్లో సంతోషం ని చూడడానికి, బతుకు తెరువు కల్పించాలని జేడీ ఫౌండేషన్ సంకల్పించడం, చాలా గొప్ప విషయం అని, ఆ దిశ గా ఇప్పటికే పదుల సంఖ్యలో చిరు వ్యాపారాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీ శ్రీనివాసరావు,ఈరోజు స్థానిక కొత్తమార్కెట్ నందు రాజ్ కుమార్ దంపతులకు తోపుడు బండి పై కూరగాయలు వ్యాపారం ని ,ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఖంభంపాటి సురేష్ కుమార్ తో పాటు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాసరావు, ఖంభంపాటి సురేష్ లు మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన వారు సంతోషంగా జీవిస్తున్నారు అని, ఉపాధి భరోసా ని స్ఫూర్తి తీసుకొని తెలుగు రాష్ట్రాల లో పలు చోట్ల ఇలాంటి వి అమలు చేయడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు. వివరాల్లోకి వెళితే భద్రాచలం పట్టణానికి వలస వచ్చిన రాజకుమార్ నాగమణి దంపతులు స్థానిక ఐటీడీఏ రోడ్ లో ఉన్న శివాలయం నందు స్వీపర్ గా పనిచేస్తున్నారు. గుడికి వచ్చే భక్తులు కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు .వీరికి ఒక కుమారుడు శివ సంతోష్ ఆ అబ్బాయికి 8 సంవత్సరాలు మెంటల్ గా ఎదుగుదల చాలా తక్కువ ఉంది, ఈ అబ్బాయి మందుల నిమిత్తం మరియు రోజు వారి ఖర్చుల కొరకు వీరి ఆదాయం చాలీచాలనందున భార్యాభర్తలిద్దరూ తోపుడు బండి పై కూరగాయలు మరియు పండ్లు కొబ్బరికాయలు అమ్ముకుని జీవనం కొనసాగిద్దామని జేడీ ఫౌండేషన్ ని సంప్రదించగా .జేడీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు అనుమతి తో కూరగాయల వ్యాపారం ని ప్రారంభించడం జరిగిందని ఫౌండేషన్ కన్వీనర్ మురళీ మోహన్ కుమార్. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ భద్రాచలం కో. ఆర్డినెటర్ శ్రీమతి హన్సి, శ్రీమతి సునీత, శ్రీకాంత్ పుష్పాలత, కడాలి నాగరాజు, యూసఫ్ మియా, ఖంభంపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *