పెరుగుతున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ (Rain Water Harvesting) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, ఇళ్లలో గుంటలు తవ్వి వర్షపు నీటిని భూగర్భ జలాల్లో కలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీటి వనరులను సంరక్షించకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని, అందువల్ల ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ తప్పనిసరి అని జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు, జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్తులో తాగునీటి కొరతను తగ్గించవచ్చని వారు తెలియజేశారు.
