రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ముచ్చెమటలు పట్టించాడు. గిరిజనులపై బ్రిటీషర్ల దోపిడీ, అన్యాయాలు పెరగడంతో గిరిజనుల్లో చైతన్యం నింపుతూ.. గెరిల్లా, యుద్ధ విద్యలు నేర్పాడు. తిరుగుబాటుకు నాయకత్వం వహించి.. పోలీసులపై దాడి చేశాడు. ఈ వీరుడి వరుసదాడులతో బ్రిటీషర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు 1924లో సీతారామరాజును కాల్చి చంపారు. 27 ఏళ్ల వయసులోనే అల్లూరి అమరుడయ్యాడు.
సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు….అల్లూరి సీతారామరాజు .