“పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం” – జేడీ లక్ష్మీ నారాయణ గారు
పుస్తక పఠనం ద్వారా మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఆలోచనల పెంపునకు మార్గం సుగమం చేస్తుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జె డి లక్ష్మీనారాయణ అన్నారు.
విశాలాంధ్ర విశాఖ 21 వ పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ఆయన ఆదివారం సాయంత్రం సదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక యుగంలో అడుగుపెట్టి జీవిస్తున్న ప్రస్తుత నవీన జీవితానికి వారధులుగా పుస్తకాలు నిలిచాయనడంలో ఏమాత్రం సందేహం లేదని పేర్కొంటూ , పుస్తక పఠనం ద్వారానే మానవుడు తనను తాను తెలుసుకుంటూ, గత సమాజ నిర్మాణాన్ని నాగరికత అభివృద్ధి అవపోసన పట్టి నేటి ఆధునిక యుగంలో మెరుగైన స్థితిలో ఉండేందుకు కృషి చేయాలని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా జీవితాన్ని కొనసాగించుటకు ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి పుస్తక పఠనం దోహదపడుతుందని అన్నారు. ఒక సమూహం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే పుస్తక పఠనం చేయాలి ముక్యంగా చిన్న పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఆధునిక నాగరికత ప్రపంచంలో అన్యాయాలు, అకృత్యాలు పెరిగిపోయాయని దీనికి కారణం పుస్తక పఠనం, ఆటలు లేకపోవడం ప్రధాన కారణంగా అభిప్రాయపడ్డారు. పుస్తక పఠనం ద్వారా అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి ఎందరో మేధావులు సమాజంలో ఉన్న అనేక అసమానతలపై పోరుబాట పట్టి, ప్రపంచంలో మానవులు అంతా సమానమే అనే భావన కల్పించారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు కి వారికి నచ్చిన పుస్థకాలు కొనుగోలు కి అయ్యే బిల్ మొత్తం ఆయన చెల్లించడంతో అక్కడ ఉన్న పలువురు పుస్థకప్రయులు సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, బూక్ హోస్ మేనేజర్ పి ఎ రాజు, సిబ్బంది మూర్తి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


