పొలంబాట పట్టిన విద్యార్థులు

13-11-2025: జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక “పొలంబాట” కార్యక్రమం నిర్వహించబడింది. Sri Chanakya Degree College (శ్రీ చాణక్య డిగ్రీ కళాశాల), కంచరపాలెం విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి Sri Varaha Lakshmi Narasimha Swamy Devasthanam (శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం) వ్యవసాయ క్షేత్రం, కృష్ణాపురంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం మరియు గౌ ఆధారిత వ్యవసాయం గురించి ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రంలో వంగ, టమాటో, మిరప వంటి కూరగాయల మొక్కలను విద్యార్థుల చేత నాటించారు. ప్రకృతి అనుకూల పద్ధతుల్లో సాగు చేసే విధానాలు, పర్యావరణానికి మేలు చేసే సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను వారికి వివరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దుర్గా ప్రసాద్ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు సేంద్రీయ వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడం మంచి పరిణామమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు, వర్మ గారు, కళాశాల ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

విద్యార్థుల్లో ప్రకృతి పట్ల మమకారం పెంపొందించడంతో పాటు, వ్యవసాయం విలువను తెలియజేసే ఈ “పొలంబాట” కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader