జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాజువాక గంట్యాడ వద్ద గల విశాఖ విమల విద్యాలయం ప్రాంగణంలో సీబీఐ మాజీ జెడి శ్రీ లక్ష్మీనారాయణ గారి చూచన మేరకు “పొలం బడి” (kitchen garden) అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో కూరగాయల మొక్కలు వంగ,టమాటో,మిర్చి,క్యాబేజీ,కాలిఫ్లవర్ తదితర మొక్కలతో పాటు తోటకూర,పాలకూర కొత్తిమీర ,నారు వేయించడం జరిగింది కూరగాయల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామం అని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈకార్యక్రమంలో 75 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పులి ఝాన్సీ లక్ష్మీ భాయ్ గారు,స్కూల్ ప్రిన్సిపాల్ జాస్మిన్ గారు, సి టి జి గ్రూప్ ప్రతినిధి ఐశ్వర్య గారు,పాన్ చారిటబుల్ ట్రస్ట్ నవీన్ గారు స్కూల్ టీచర్స్, జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు..జెడి ఫౌండేషన్, గోపాలపట్నం,విశాఖపట్నం.🌳🌳🌳🌳.