విశాఖపట్నంలో జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం విశేష స్పందనను పొందింది. పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తుల హాజరు ఊహించని స్థాయిలో ఉంది.
ఈ సందర్భంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు ఎం. సతీష్ కుమార్ గారు వినాయకుని వేషధారణలో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన వినాయక వేషధారణతో పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా ఫోటోలు తీసుకుంటూ కార్యక్రమానికి మరింత ఆకర్షణను తెచ్చారు.
ప్రతిమలు తీసుకునే భక్తులకు సతీష్ గారు పూజ అనంతరం నిమజ్జనం నీటిలో కాకుండా మొక్కల కుండీలలో చేయాలని సూచించారు, తద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సందేశం అందించారు.

ఈ కార్యక్రమం ద్వారా జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యులు పర్యావరణ హితమైన ఉత్సవాల ప్రాముఖ్యతను ప్రజల్లో చైతన్యం కలిగించారు. భక్తులు ఆనందంగా పాల్గొని, గణపతి బప్ప మోరియా అంటూ ఉత్సాహంగా ఫొటోలు తీసుకోవడం విశేషంగా నిలిచింది.


