


విజయనగరం జిల్లా, రాజాం ప్రాంతానికి చెందిన ప్రమఖ యువ పారిశ్రామిక వేత్త శ్రీ లోలుగు మదన్ మోహన్ గారి మాతృమూర్తి శ్రీ సుశీల గారి జ్ఞాపకార్థం నేడు శ్రీమతి సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ను ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథగా శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. దీప ప్రజ్వలన చేసి, ఫౌండేషన్ లోగో అవిషరంచిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే నిరుపేద సివిల్స్ ఆశావహులకు ఉచిత శిక్షణ, బాలికా విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ అర్హులైనవారందరికీ సేవలందిస్తూ, ఈ ప్రాంత వాసులని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని కోరారు.
ఈ క్రమంలో ఈ ప్రాంతం నుండి శ్రీ GMR గారినీ మరియు లోలుగ మదన్ మోహన్ గారిని ఆదర్శంగా తీసుకుని, మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు తయారుకావలని అందుకు దోహదపడే ఒక ఇంకుబేశన్ సెంటర్ ను ఏర్పాటు చేసి వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువతను ప్రోత్సహించాలని జేడీ గారు సూచించారు.
దీనికి సానుకూలంగా స్పందిస్తూ శ్రీమతి సుశీల మెమోరియల్ ఫౌండేషన్ వారు తమ రాజాం ప్రాతంలో ఒక ఇన్కుబేషన్ సెంటర్ మరియు ఒక ఆదర్శ గ్రామాన్ని సైతం ఏర్పాటు చేస్తామని జేడి గారికి హామీ ఇచ్చారు.