29-05-2025 తేదీన మహిళా సాధికారికతకు వెన్నుదన్నుగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ & కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయబడింది.
ఇది మొట్టమొదటిసారిగా జేడీ ఫౌండేషన్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేసిన ఒక మైలురాయి కార్యక్రమం.
ఈ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరు మహిళలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరింది:
- శ్రీమతి జి. సంధ్య
- శ్రీమతి కె. ధనలక్ష్మి
₹5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వీరికి ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పించబడింది.
శిక్షణా కేంద్రం లక్ష్యం :
- ఒంటరి మహిళలు, నిరుపేద మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం.
- కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ద్వారా ఆదాయం పొందే అవకాశాలు కల్పించడం.
- మహిళలు స్వశక్తిపై ఆధారపడేలా చేయడం.
మంచిర్యాల జిల్లా దేవపూర్ గ్రామానికి చెందిన సంధ్య మరియు ధనలక్ష్మి, గత కొన్నేళ్లుగా కుట్టు మరియు ఎంబ్రాయిడరీలో నైపుణ్యం సాధించారు.
అయితే, స్వంతంగా శిక్షణా కేంద్రం ప్రారంభించేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో జేడీ ఫౌండేషన్ ను సంప్రదించారు.
ఈ అవసరాన్ని అర్థం చేసుకున్న జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు సానుకూలంగా స్పందించి ఈ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు.

“మా అవసరాన్ని గుర్తించి, మా నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం ఇచ్చి స్వశక్తిపై నిలబడేందుకు సహాయం చేసిన జేడీ ఫౌండేషన్ కు మరియు ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.”
