కోనసీమ ఆహారనిధి మరియు జేడీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో , ఆహారనిధి వ్యవస్థాపకుడు వీరంశెట్టి సతీష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ చేయడం జరిగింది..
ముఖ్య అతిథిగా విచ్చేసిన కోనసీమ జిల్లా పంచాయితీ రాజ్ DE శ్రీ ఆన్యం రాంబాబు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా సతీష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలియచేశారు..
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యం చేస్తున్న మాజీ సీబీఐ జేడీ శ్రీ వి.వి లక్ష్మీనారాయణ గారికి వారి ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలియచేశారు..
ఈ కార్యక్రమంలో ఇరుసుమండ సర్పంచ్ శ్రీమతి అక్కిశెట్టి నాగమణి పెద్ద , బండారు సురేష్, రంకిరెడ్డి బ్రహ్మజీ, సిద్దాబత్తుల పెద్దారి, ఆకుల రాజు, గ్రామస్తులు వీరంశెట్టి రాంబాబు, ఆకుల బాబ్జి,సుంకర రాంబాబు, మోటురి వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
జెడి ఫౌండేషన్ గోపాలపట్నం , భద్రాచలం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక మట్టి విగ్రహాలు పిన్నమనేని ఫంక్షన్ హాల్ వద్ద పంపిణీ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో జెడి గ్రూప్ సభ్యులు మురళీమోహన్ కుమార్ ,హన్సి పవన్ గారు మరియు స్థానికులు పాల్గొన్నారు జెడి ఫౌండేషన్ గోపాలపట్నం , భద్రాచలం , కోనసీమా.




