“రక్త దాతలు కండి.. ప్రాణదాతలుగా మారండి”.
జే.డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు. రక్త దాతలు కండి.ప్రాణ దాతలు గా మారండి అనే నినాదంతో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు రక్త దానం చేయడం కోసం ముందుకు రావడం విశేషం అని, అందుకు ప్రతీ ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు “OAK wood international” స్కూల్ అధినేత శ్రీమతి శారద. ఈమేరకు ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకుని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, “OAK Wood international” స్కూల్ ,కొత్తపేట, దిలీషుఖ్ నగర్ క్యాంపస్ ఆవరణలో, తలసేమియా చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని శ్రీమతి శారద ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీమతి శారద మాట్లాడుతూ సమాజంలో తలసేమియా వ్యాధి తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని, రాష్టం లో చాలా స్వచ్ఛంద సంస్థలు, బ్లడ్ డొనేషన్ సంస్థలు, రెడ్ క్రాస్ ఇలా చాలా సంస్థలు సేవలు అందిస్తున్నా ఇంకా రక్తం కొరత ఉండడం చాలా బాధాకరం అని, ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, తమ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఈ క్యాంప్ నందు రక్త దానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అందరికి పేరు పేరు న కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ క్యాంప్ నిర్వహణ కి పూర్తి సహాయ సహకారాలు అందించిన జేడీ ఫౌండేషన్ కి, ఫౌండేషన్ చైర్మన్ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ రామకృష్ణ రెడ్డి తో పాటు, తలసేమియా చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినెటర్ శ్రీ మధు, స్కూల్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
“రక్త దాతలు కండి – ప్రాణదాతలుగా మారండి”

Categories: