రాష్ట్రంలో అతి పెద్ద స్టీల్ కర్మాగారం విశాఖ ఉక్కు పరిశ్రమ ఎన్నో ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో, వేల మంది రైతులు భూ త్యాగాలతో అప్పటి ప్రధాని ఇందిరమ్మ పై రాష్ట్ర నాయకులు ఏకతాటిపై కి వచ్చి పట్టు పట్టి దక్కించుకున్నాం. అంత చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరణ చేస్తోంది. ఆ నిర్ణయని వెతిరేకిస్తూ పరిశ్రమను కాపాడుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు ప్రజా సంఘాలు, నాయకులు, రాజకీయ పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి.
అందులో భాగంగా అనేక ఉద్యమాలు, నిరసనలు, దీక్షలు వివిధ మార్గాలలో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూనే ఉన్నారు.
ఈరోజు కార్మిక సంఘాలు మహా పాదయాత్ర చేపట్టాయి అందులో ముఖ్య అతిధిగా వి.వి (జేడీ) లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు.



