రైతుపూజోత్సవం , రైతులకు సన్మాన కార్యక్రమం లో వెలుగు డైరెక్టర్ ఉదయ్ మోహన్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జే.డీ. V.V లక్ష్మి నారాయణ….
అన్నమయ్య జిల్లా, బి. కొత్తకోట మండలం బందారువారి పల్లి పంచాయతీ, పెద్దపల్లి గ్రామం, కార్తికేయ ఫార్మ్ హౌస్ నందు శ్రీ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జే .డి ఫౌండేషన్ టీం ఆధ్వర్యంలో రైతుపూజోత్సవం , రైతులకు సన్మాన కార్యక్రమం . ముఖ్య అథితులు శ్రీ V.V లక్ష్మి నారాయణ గారు IPS , CBI -Ex -JD, Additional Director General of Police , జే .డి ఫౌండేషన్ టీం .
ఈ రోజు బి. కొత్తకోట మండలం బందారువారి పల్లి పంచాయతీ, పెద్దపల్లి గ్రామం, కార్తికేయ ఫార్మ్ హౌస్ నందు v.v లక్ష్మి నారాయణ గారి చేతుల మీదుగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడమైనది .
ఈ కార్యక్రమంలో v.v. లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ రైతు గొప్పతనాన్ని వివరించారు , ప్రతి రైతుకి గుర్తింపు అవసరమని , ప్రతి ఒక్కరు పండించే ఆహరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని తెలిపారు. భయంకరమైన కరోనా వైరస్ వాళ్ళ ప్రపంచమంతా ఆగినా, రైతు మాత్రమే అహర్నిశలు శ్రమించాడని తెలిపారు . అలాగే ఈ తొలకరి వర్షాల గురించి, దాని ప్రయోజనాల గురించి , రైతులకు ప్రోత్సాహకరమైన విషయాలను తెలియజేసారు .
ఈ కార్యక్రమంలో 80 మంది మహిళల రైతులు , 40 మంది రైతులు హాజరుకాగా , ముఖ్యమైన రైతులు బి. శ్రీకాంత్ రెడ్డి , రంగసముద్రం ,కే. సహదేవ్ రెడ్డి, మొలకల చెరువు , బి . చంద్ర రెడ్డి, కాలవ పల్లి, ఎన్ . రఘునాథ రెడ్డి , బి కొత్తకోట తదితరులను శాలువలతో సన్మానించారు, అలాగే పెద్దపల్లి గ్రామ రైతులకు శాలువలను , మహిళా రైతులకు చీరలను పంపిణి చేసారు .
ఈ కార్యక్రమంలో V .V. లక్ష్మి నారాయణ, IPS , CBI -Ex -JD, Additional Director General of Police గారు వెలుగు సెక్రటరీ యం. ఉదయ్ మోహన్ రెడ్డి గారు, కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి గారు, J.D ఫౌండేషన్ టీం భవాని గారు ,80 మంది మహిళల రైతులు , 40 మంది రైతులు , రైతులు బి. శ్రీకాంత్ రెడ్డి , రంగసముద్రం ,కే. సహదేవ్ రెడ్డి, మొలకల చెరువు , బి . చంద్ర రెడ్డి, కాలవ పల్లి, ఎన్ . రఘునాథ రెడ్డి , బి కొత్తకోట, పెద్ద పల్లి రైతులు తదితరుల పాల్గొన్నారు.