తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం, అన్నవరప్పాడు శాఖ ఆధ్వర్యంలో జే.డి. పౌండేషన్ టిమ్ పౌండర్ జే.డి లక్ష్మినారాయణగారి ఆదేశాల మేరకు ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతు పూజోత్సవం నిర్వహించారు..
ఉమ్మడి గోదావరి జిల్లా జే.డి. పౌండేషన్ కన్వీనర్ శ్రీ పోప్పోప్పు వెంకట నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, అన్నవరప్పాడు శాఖ జే.డి. పౌండేషన్ సభ్యులు బోలిశెట్టి ప్రకాశ్, పోప్పోప్పు సర్వేశ్వరావు, పోప్పోప్పు శివ రైతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అణతరం రైతులకు సన్మానం చేసి మిఠాయిలు, వస్త్రాలు,పారలు అందించారు..
రైతు సంక్షేమంగా ఉంటేనే, గ్రామాలు,దేశాలు సుభిక్షంగా ఉంటాయని ,అన్నదాతకి వెన్నుదన్నుగా అందరూ నిలవాలని కోరారు..
ఈ కార్యక్రమంలో పిట్టల వేమవరం సర్పంచ్ మండ హైమ చిన్నా వెంకటరెడ్డిగారు, ఆ గ్రామంలోని రైతులు ముదుండి రంగరాజు గారిని,గుత్తులు ఈశ్వరరావు గారిని,మామిలపల్లి నాగరాజు గారిని,పడాల కేశవ నరసింహరెడ్డి గారిని,సత్తి నాగవెంకట శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కర్రీ శ్రీనివాస్ రెడ్డి, గాదిరాజు రంగరాజు, మండ విశ్వనాధ్ రెడ్డి, తాదితారులు పాల్గొన్నారు.
జే.డి. పౌండేషన్ టిమ్,తూర్పు గోదావరి జిల్లా.