మాజీ సీబీఐ జెడి శ్రీ వి.వి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో నడుస్తున్న “జెడి ఫౌండేషన్ మరియు కోనసీమ ఆహారనిధి” ఆధ్వర్యంలో, కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం,ఇరుసుమండ గ్రామంలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతు పూజోత్సవం నిర్వహించారు. ఆహారనిధి వ్యవస్థాపక అధ్యక్షడు వీరంశెట్టి సతీష్ రైతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి,రైతులకు సన్మానం చేసి మిఠాయిలు అందించారు. రైతు సంక్షేమంగా ఉంటేనే, దేశం సుభిక్షంగా ఉంటుందని ,అన్నదాతకి వెన్నుదన్నుగా అందరూ నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వీరంశెట్టి రాముడు, రంకిరెడ్డి కాశి, రంకిరెడ్డి బ్రహ్మాజీరావు, ఎర్రంశెట్టి వెంకటేష్, ఆకుల రాజు, వీరంశెట్టి వినయ్, చిన్నం విజయరావు, ఏడుకొండలు పాల్గొన్నారు.



