“నిరుపేద యువకుడికి ట్రై సైకిల్ వితరణ”.
ఎదుటివారు నిస్సహాయ స్థితి లో వున్నపుడు అడగకున్న సాయం చేయాలి అనే గొప్ప విజ్ఞత ని చాటారు “జేడీ ఫౌండేషన్” భద్రాచలం వారు, వివరాలలోకి వెళితే భద్రాచలం అశోక్ నగర్ కాలనీ కి చెందిన బోస్ రామకృష్ణ అనే దివ్యంగుడు కావడంతో,నేల పై పాకేటప్పుడు రెండు కాళ్లకు గాయాలయ్యి ఇబ్బంది పడుతున్న నేపధ్యాన్ని మిత్రుల ద్వారా తెలుసుకున్న జెడి ఫౌండేషన్ కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీగుండపనేని సతీష్ గారి సహకారంతో ట్రై సైకిల్ ని రామకృష్ణ కి అందించడం జరిగింది. తమ పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణ అవసరం నిమిత్తము ట్రై సైకిల్ అందజేసిన చేసిన జేడీ ఫౌండేషన్ బాధ్యులు మురళి మోహన్ కుమార్ కి మరియు వారి సభ్యులకి జీవితాంతం రుణపడి ఉంటామని తల్లి షేక్ చోటి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శ్రీ కడాలి నాగరాజు,శ్రీమతి హన్సి, భద్రాద్రి జిల్లా వికలాంగులసంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ గుండపనేని సతీష్,శ్రీ ఎం.డి సర్వార్ మియా తదితరులు పాల్గొన్నారు.

