28-06-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, విశాఖపట్నంలోని గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేకంగా “విత్తన బంతుల తయారీ కార్యక్రమం” నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా, నదీ పరివాహక ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు వంటి శూన్య భూభాగాల్లో సామాజిక వనాలు పెంపుట కోసం ఈ కార్యక్రమం చేపట్టబడింది.
విద్యార్థులతో తయారు చేసిన విత్తన బంతుల్లో ఉపయోగించిన విత్తనాలు :
- సీతాఫలం
- సపోటా
- బొప్పాయి
- నేరేడు
- గంగరావి
- పనస
- మారేడు
- చింత
- వేప
- కుంకుడు
- పెద్ద గురివింద
- తురాయి
- రేగు
- తదితర విత్తనాలు

విద్యార్థులకు ముందుగా విత్తన బంతుల అవసరం, వాటి ప్రయోజనం, మరియు పర్యావరణంలో వాటి పాత్రను వివరించబడింది. అనంతరం విద్యార్థులతో స్వయంగా విత్తన బంతులను తయారు చేయించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథి :
విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు
- విత్తనబంతులు మొలకెత్తి చెట్లు పెరగడం ద్వారా నగరంలో వాతావరణ కాలుష్యం తగ్గించడంలో సహాయపడతాయి అని పేర్కొన్నారు.
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు :
- శ్రీమతి కారుమూడి అను గారు, ఉత్తరాంధ్ర కన్వీనర్, జేడీ ఫౌండేషన్
- ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
- వై. స్వర్ణలత గారు
- వై. వేణుగోపాల్ గారు
- పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు
- మజ్జూరి శ్రీనివాసరావు గారు
- వై.ఎన్. ప్రసాద్ బాబు గారు
- జేడీ గ్రూప్ సభ్యులు
- పాఠశాలల ఉపాద్యాయులు








