విత్తన బంతులు విసిరిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (నరవ) విద్యార్థినీ విద్యార్థులు

30-08-2025 న ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సీబీఐ మాజీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనతో, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (నరవ) కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సామాజిక వనాలు పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.

కార్యక్రమంలో, కాలేజ్ ప్రక్కన ఉన్న కొండపై గంగరావి, మారేడు, మొక్కజొన్న, తురాయి, సీతాఫలం, సపోటా, వేప, బాదం, చింత, కుంకుడు తదితర విత్తనాలతో తయారుచేసిన విత్తన బంతులను విద్యార్థులు విసరడం జరిగింది. ఈ విధంగా, భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడటానికి, సమాజంలో పచ్చదనం పెంపొందించడానికి ఒక మంచి శకం ప్రారంభించబడింది.

కార్యక్రమంలో పాల్గొన్న కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ పి. ప్రదీప్ వర్మ గారు, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి మరియు విద్యార్థుల స్థాయిలోనే మొదలుపెట్టి అవగాహన పెంచుకోవాలి అని సూచించారు.

ఇవ్వరూ కార్యక్రమంలో పాల్గొన్నారు:

  • జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు
  • పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ శ్రీ పి. ప్రసాద్ గారు
  • డీన్ డాక్టర్ డి. శాంతారావు గారు
  • ఓ ఎస్ డీ గాయత్రీరాం గారు
  • ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ వీరు నాయుడు గారు
  • ఇతర కాలేజ్ స్టాఫ్ మరియు జేడీ గ్రూప్ సభ్యులు

విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, విత్తన బంతులు విసరడం ద్వారా ప్రకృతి ప్రేమను ప్రదర్శించారు. వారి సహకారం వలన కొండపై సామాజిక వనాలను పెంపొందించడానికి ఒక స్ఫూర్తిదాయక ప్రారంభం ఏర్పడింది.

కార్యక్రమం ముగిసిన తరువాత, కళాశాల యాజమాన్యం ఫౌండేషన్ సభ్యులకు ఈ వినూత్న కార్యక్రమం కోసం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో పర్యావరణ చైతన్యం, సమాజ సేవా భావన, మరియు వృక్షాల పరిరక్షణలో భాగస్వామ్యం పెంపొందించడంలో ఒక ప్రతీకాత్మక ఉదాహరణగా నిలిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader