25-09-2025న, 94వ వార్డు, వేపగుంట జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీసు ప్రక్కన ఉన్న గంగి రెడ్డ్ల కాలనీ వద్ద “ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట – స్వచ్ఛతా హి సేవా – స్వచ్ఛోత్సవం” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
జీవీఎంసీ ఆహ్వానం మేరకు జేడీ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ ఇన్‌చార్జ్ జోనల్ కమిషనర్ శ్రీ శంకరరావు గారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. తడి చెత్త – పొడి చెత్తను వేరు చేసి జీవీఎంసీ చెత్త బండికి అందజేయడం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అలాగే ఎస్.ఎస్. సూర్యనారాయణ గారు మాట్లాడుతూ,
దోమల వ్యాప్తిని నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, ఇతర జీవీఎంసీ మరియు సచివాలయం సిబ్బంది, స్థానికులు, మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం, ఈ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించబడింది. తదనంతరం, మొక్కలు నాటి, పరిసరాలను పచ్చదనంతో నింపుతూ, వస్త్ర సంచులను జడ్డ్ సి గారు పంపిణీ చేయడం జరిగింది.

జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, మరియు సామాజిక బాధ్యత పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంలో ముందంజలో ఉంది. “స్వచ్ఛత హీ సేవా – మనందరి బాధ్యత” అనే నినాదంతో, ప్రతి పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా స్వచ్ఛ భారత్ లక్ష్యం సాధించగలమని ఫౌండేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడడం, చెత్తను సక్రమంగా నిర్వహించడం, మరియు పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా జేడీ ఫౌండేషన్ సమాజ అభివృద్ధికి తన కృషిని కొనసాగిస్తోంది.


