పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది నిర్వహించబడే మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించాయి.
“మట్టి గణపతినే పూజిద్దాం — పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో, గోపాలపట్నం పిన్నమనేని ఫంక్షన్ హాల్ వద్ద భక్తులకు విత్తన మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా పాల్గొని, “పర్యావరణ పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాల్లో తరచూ తనను కూడా భాగస్వామిని చేయడం ఎంతో సంతోషంగా ఉంద”ని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధి పిన్నమనేని శ్రీనివాస్ గారు, జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అనుగారు, అలాగే జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రతిమల తయారీలో భాగంగా, విత్తనాలు కలిపిన మట్టి గణపతులను తయారు చేయడం ద్వారా పర్యావరణ హిత ఉత్సవాల ప్రాముఖ్యతను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో గ్రూప్ సభ్యుల కృషి విశేషం. ప్రతిమలను సిద్ధం చేయడం, వాటిలో విత్తనాలు జోడించడం,
శ్రీకాకుళం వాస్తవ్యులు శ్రీ కుమార స్వామి గారు ఆర్థిక సాయంతో చామంతి మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది.
అదనంగా, గ్రూప్ సభ్యుడు రత్నం గారు హెర్బల్ టీ తయారుచేసి అందించగా,

మూడు రోజులపాటు సభ్యులందరి సమష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. జేడీ ఫౌండేషన్ తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ,
మట్టి గణపతిని పూజించి — పర్యావరణాన్ని కాపాడుదాం అనే స్ఫూర్తిదాయక సందేశాన్ని అందజేశారు.














