07-09-2025: ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు, విశాఖపట్నం 89వ వార్డు సంతోష్ నగర్, వెంకటాపురం రోడ్, జి.ఎస్.ఎస్ టవర్స్, అమ్మా రెసిడెన్సీ, భగత్ సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబడింది.
జీవీఎంసీ జోన్-8 వారు సమకూర్చిన వేప, తురాయి, బాదం, బోగడ, టొబాబియా, కదంభం వంటి మొక్కలను నాటడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 89వ వార్డు కార్పొరేటర్ శ్రీ దాడి వెంకట రమేష్ గారు హాజరై మాట్లాడుతూ —
- “పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అత్యంత అవసరం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, దాన్ని బాధ్యతగా పెంచాలి” అని పిలుపునిచ్చారు.
వక్తలు కూడా వేసిన మొక్కలను స్థానికులు సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానికులు, జేడీ గ్రూప్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భగత్ సింగ్ నగర్ ప్రాంతంలో పాల్గొన్న వారికి వస్త్ర సంచులు అందజేయడం జరిగింది.
అలాగే, సంతోష్ నగర్ – వెంకటాపురం రోడ్ వద్ద వ్యవసాయం చేసుకుంటున్న రైతు ఆకుల వెంకటరావు గారికి కొబ్బరి మొక్కలు అందజేయడం జరిగింది.

18-09-2025: ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, రైల్వే ట్రైనింగ్ సెంటర్, మర్రిపాలెం వద్ద జీవీఎంసీ వారు సమకూర్చిన కొబ్బరి, సపోటా, బాదం తదితర మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో
- ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీ సి.వి.వి.ఎస్. ప్రసాద్ గారు,
- సీనియర్ ఇనస్ట్రక్టర్స్ శ్రీ పి. శ్రీనివాసరావు గారు, శ్రీ ఎస్. అమర్నాథ్ గారు,
- ఇతర రైల్వే అధికారులు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

వక్తలు మాట్లాడుతూ — “పర్యావరణ పరిరక్షణలో జేడీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం” అని పేర్కొన్నారు.










