22-06-2025 న విశాఖపట్నంలో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విత్తన బంతుల కార్యక్రమానికి సంబంధించి ఒక ముఖ్యమైన దశ విజయవంతంగా పూర్తి చేయబడింది. విత్తన సేకరణ గ్రూప్ సభ్యులు కలిసి వివిధ రకాల విత్తనాలను సేకరించడం, వాటిని వర్గీకరించడం మరియు లెక్కించడం వంటి పనులను నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక గ్రూప్ సభ్యుల పిల్లలు కూడా చురుకుగా పాల్గొన్నారు.
వారి సహకారంతో:
విత్తనాల విభజన & లెక్కింపు వివరాలు :
- మొత్తం 28 రకాల విత్తనాలు
- సుమారు 60,000 విత్తనాలు
- విత్తనాల శుభ్రపరిచడం, వర్గీకరణ, మరియు నిల్వ కోసం వేర్వేరు బాక్సుల సిద్ధం
ఈ విత్తనాలతో జేడి ఫౌండేషన్ రూపొందించిన
“సీడ్ బ్యాంక్” బాక్స్ :
పర్యావరణహితంగా సిద్ధంచేయబడింది.
ఈ బాక్స్ భవిష్యత్‌లో విత్తన బంతుల తయారీ, చెట్ల పెంపకం కార్యక్రమాల్లో ఉపయోగించబడుతుంది.

విద్యార్థులకు పర్యావరణ అవగాహన :
విత్తనబంతుల తయారీకి ముందు:
- విత్తనాల ప్రాముఖ్యత
- పర్యావరణ పరిరక్షణలో విత్తనబంతుల పాత్ర
- చెట్ల పెంపకానికి అవసరమైన జాతుల ఎంపిక
విషయాలను విద్యార్థులకు వివరించి, తదుపరి వారు స్వయంగా విత్తన బంతులు తయారు చేయడం జరిగింది.

విషయాలను విద్యార్థులకు వివరించి, తదుపరి వారు స్వయంగా విత్తన బంతులు తయారు చేయడం జరిగింది.

