17-09-2025న ప్రపంచ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” పేరుతో విశాఖపట్నంలో బీచ్ క్లీనప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం సిటీ లా సన్స్ బే కొలనీ ఎదురుగా ఉన్న పెద్ద జాలారిపేట వద్ద జరిగింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌జిఓలు, మరియు మత్యకార సాధికార సమితి సభ్యులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగమై, తీరప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేయడం ద్వారా సముద్ర పర్యావరణ పరిరక్షణకు తమ సేవలను అందించారు.
ఈ కార్యక్రమంలో మత్యాకార సంక్షేమ సమితి అధ్యక్షుడు వుమ్మడి మహేష్ గారు, ఇంకాయ్స్ డైరెక్టర్ బాలకృష్ణ నాయర్ గారు, మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను నిర్వాహకులు పంపిణీ చేశారు.
జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ముందంజలో ఉంది. ఈ బీచ్ క్లీనప్ కార్యక్రమం ద్వారా సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, భవిష్యత్ తరాలకు “ప్లాస్టిక్ రహిత తీరప్రాంతం” అనే సందేశాన్ని అందజేసింది. “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్ – మనందరి బాధ్యత” అనే నినాదంతో, సమాజం మొత్తం పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జేడీ ఫౌండేషన్ పిలుపునిచ్చింది.
