20-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా” కార్యక్రమం సందర్భంలో, ఆంధ్రా విశ్వకళా పరిషత్ స్వర్ణోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా, జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ డా. వి. ఎస్. కృష్ణ లైబ్రెరీ ప్రాంగణంలో, ప్రధాని నరేంద్ర మోడి గారి “మన్ కి బాత్” కార్యక్రమం పిలుపు మేరకు, మియావాకీ పద్ధతిలో అర్బన్ ఫారెస్టైజేషన్ కార్యక్రమం చేపట్టబడింది.
జీవీఎంసీ వారు సమకూర్చిన తురాయి, కదంభం, బొగడ, సపోటా, బాదం, టొబాబీయ తదితర మొక్కలను లైబ్రెరీ ప్రాంగణంలో నాటడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్ గారు, యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటడం ఎంతో సంతోషకరమైన విషయం అని పేర్కొని, జేడీ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.
అలాగే భవిష్యత్తులో యూనివర్సిటీ క్యాంపస్‌లో మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. రాంబాబు గారు, లైబ్రెరీయన్ చలమశెట్టి శ్రీనివాసరావు గారు, సూపరింటెండ్ హరికృష్ణ గారు, జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు, సహకార బ్యాంకు చైర్మన్ పొప్పోపు నాగేశ్వరరావు గారు, మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణకు, ప్రజల్లో పచ్చదనం పట్ల అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తోంది.
“ఒక చెట్టు – వందల ప్రాణాలకు ఆక్సిజన్” అనే నినాదంతో, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని ఫౌండేషన్ సభ్యులు పిలుపునిచ్చారు.

మియావాకీ పద్ధతిలో అర్బన్ ఫారెస్ట్స్ సృష్టించడం ద్వారా నగర ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం, పక్షులు మరియు చిన్న జీవులకు నివాస స్థలం కల్పించడం లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేస్తోంది.


